Horoscope: శుక్రవారం రాశిఫలాలు! జ్యోతిష్య నిపుణుల సూచనలు, ప్రతీ రాశికి సంబంధించిన వివరణాత్మక ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. పనులు సవ్యంగా పూర్తి కావాలన్నా, ఆర్థికంగా లాభాలు పొందాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
మీరు ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో ప్రణాళికతో వెళితే మంచి ఫలితాలు వస్తాయి. పెద్దల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. స్నేహితుల సాయంతో పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆత్మవిశ్వాసంతో మీరు విజయాలు సాధిస్తారు. మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సమయాన్ని సరిగ్గా వాడుకోవడం విజయానికి మూలం. అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడండి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
నిలకడగా ప్రయత్నిస్తే మీకు విజయం దక్కుతుంది. ఓర్పు, నేర్పు మీ విజయానికి దారులు అని గుర్తుంచుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీరు అనుకున్న పనులలో మంచి ఫలితాలు వస్తాయి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మీలోని ధైర్యం, నమ్మకం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. ఉద్యోగం చేసే వారికి ఇది మంచి సమయం. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
పట్టుదల, శ్రద్ధతో ఉంటే విజయం మీదే. ఏ పనిని అయినా ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అయితే, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ముందుచూపుతో వ్యవహరించి గొప్ప విజయం సాధిస్తారు. మీ అంకితభావం విజయాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా గౌరవాభిమానాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
పట్టుదలతో సమస్యలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలను తెస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మానసిక బలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
మీరు చేసే పనికి తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన పనులకు ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వృత్తి జీవితం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గట్టి సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరులను ఎక్కువగా నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించండి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పని చేస్తే విజయానికి దగ్గరవుతారు. విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది.