Horoscope: ఈ రోజు, అక్టోబర్ 17, 2025 శుక్రవారం, మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, ఆర్థిక విషయాలు, కుటుంబ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
మేష రాశి (Aries) :
ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగే స్థాయిలో బలంగా ఉంటుంది, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఇంట్లో, బయటా గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే, ప్రయాణాల్లో, తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి వార్తలు అందుతాయి. శివారాధన మీకు శుభప్రదం.
వృషభ రాశి (Taurus) :
తలపెట్టిన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ ఉన్నా, సమయానికి పనులు పూర్తి చేసి అధికారుల నమ్మకాన్ని పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, వారికి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. మొహమాటాల వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభకరం.
మిథున రాశి (Gemini) :
ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, గౌరవం పెరుగుతాయి. పదోన్నతికి కూడా మంచి అవకాశం ఉంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీకు ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. దైవారాధన మానవద్దు.
కర్కాటక రాశి (Cancer) :
ఉద్యోగంలో మీ బాధ్యతలతో పాటు ఇతరుల బాధ్యతలను కూడా పంచుకోవాల్సి వస్తుంది, దీనివల్ల అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అయితే, కొందరి వల్ల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త వహించండి. కలహాలకు తావివ్వకుండా, ప్రశాంతంగా ఉండండి. శివారాధన ఉత్తమం.
సింహ రాశి (Leo) :
వృత్తి, ఉద్యోగాల్లో మీ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఒక శుభకార్యానికి ప్రణాళిక వేస్తారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు విజయం సాధిస్తాయి. నిరుద్యోగులకు మిత్రుల సహాయంతో ఉద్యోగం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులుంటాయి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభకరం.
కన్యా రాశి (Virgo) :
ఉద్యోగంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి, ఆదాయం బాగా పెరుగుతుంది. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల నుంచి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. దుర్గా దేవి దర్శనం మనోబలాన్ని పెంచుతుంది.
తులా రాశి (Libra) :
మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇల్లు, వాహనాలు కొనుగోలుపై దృష్టి సారిస్తారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మాతా పితృ వందనం మంచి చేస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio) :
మీరు మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
ధనుస్సు రాశి (Sagittarius) :
శ్రద్ధతో చేసిన పనులు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేపడతారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సంబంధబాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. అష్టలక్ష్మీ స్తోత్రం పఠించడం మంచిది.
మకర రాశి (Capricorn) :
మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారాల్లో పని భారం కాస్త ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న గిట్టనివారు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు, జాగ్రత్త. ఆదాయం వృద్ధి చెందుతుంది. చంద్ర ధ్యానం శుభప్రదం.
కుంభ రాశి (Aquarius) :
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. పనిభారం పెరిగినా, ఆశించిన ఫలితం చేతికి అందుతుంది. కీలక వ్యవహారాలలో మీ బుద్ధిబలంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. చేపట్టిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త వింటారు. విష్ణు ఆరాధన శుభప్రదం.
మీన రాశి (Pisces) :
మీరు మంచి పనులను మొదలుపెడతారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కొన్ని సంఘటనల ద్వారా అయినవారు, కానివారు ఎవరో తెలుసుకుంటారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. గురు ధ్యానం మంచిది.