Hong Kong Warriors: హాంగ్ కాంగ్ సినీ చరిత్రలో వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రం ‘హాంగ్ కాంగ్ వారియర్స్’. లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కి సోయ్ చీయాంగ్ దర్శకత్వం వహించారు. కిన్-యీ ఔ, తై-లీ చాన్, లి జున్ రైటర్స్. హాంగ్ కాంగ్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా జనవరి 24న భారతదేశంలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్.వి.ఆర్. సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్ ను విడుదల చేశారు.
