Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను తొలగించారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో బైఠాయించారు.
ఈ సంఘటనతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. పరస్పరం కుర్చీలు విసురుకునే వరకు పరిస్థితి ముదిరింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహా పలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.