HMPV In India

HMPV In India: ముచ్చటగా మూడో HMDV కేసు.. అదిరిపడుతున్న జనం.. ఎక్కడ అంటే

HMPV In India: హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి భారత్‌లోనూ మొదలైంది. ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆస్పత్రిలో ఈ వైరస్ సింటమ్స్ ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు. ఈ విషయాని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ఇంకో పాజిటివ్ కేసు గుజరాత్ లో నమోదు అయింది. దింతో ఒక్కసారిగా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

గుజరాత్ రాష్ట్రంలో తొలి హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం. 2 నెలల శిశువుకి HMPV వైరస్‌ సోకడంతో ప్రస్తతం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.

ఇంకోవైపు ఇవాళ ఉదయం కర్నాటకలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 3,8 నెలల
వయసు ఉన్న ఇద్దరు చిన్నారులకు ఈ HMPV వైరస్‌ సోకినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దింతో ప్రస్తుతం దేశం 3 కేసులు వెలుగులోకి వచ్చాయి. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ICMR సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వాచినట్టు తేలింది అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుంది. ఇది శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ఈ వైరస్ ప్రత్యేకించి యువకులకి , వృద్ధులకి ఎక్కువగా వస్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Space spy squad: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్పై శాటిలైట్.. సరిహద్దు నిఘాలో భారత్ సంచలనం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *