Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం గాఢ విషాదాన్ని సృష్టించింది. ఆదివారం ఉదయం, జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టి, వారు మృతి చెందారు. మృతులుగా పరందాములు (రాయపోల్ పోలీస్ స్టేషన్), వెంకటేశ్ (దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్)లో కానిస్టేబుల్స్ గా పని విధులు నిర్వహిస్తున్న వారిగా గుర్తించబడ్డారు.
ఈ ఇద్దరూ ఈసీఎల్ (ఎంప్లాయీస్ ఫ్రెండ్) లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనడానికి ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోతుండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.