Hit 3

Hit 3: రెండో పాటలో సూపర్ సర్ప్రైజ్!

Hit 3: అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ రచ్చ చేస్తూ వచ్చేసింది ‘హిట్-3’ సెకండ్ సింగిల్. నేచురల్ స్టార్ నాని రూత్‌లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నేరస్థులపై దుమ్మురేపుతూ అగ్గిరాజేస్తున్నాడు. ఈ సాంగ్ అగ్రెసివ్ టోన్‌తో సినిమా స్లోగన్‌గా మారి, అంచనాలను ఓ రేంజ్‌లో పీక్స్‌కు తీసుకెళ్లింది. లిరికల్ వీడియో చివర్లో మేకర్స్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు- ఏప్రిల్ 14న ట్రైలర్ రిలీజ్! శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తుండగా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు బిగ్ ప్లస్ అవుతోంది. మే 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని టాక్. నాని ఫ్యాన్స్ ఈ సాంగ్‌తో ఫుల్ జోష్‌లోకి వచ్చేశారు. ఈ పాట చూస్తేనే అర్జున్ సర్కార్ ఖాతాలో హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు రోజులు లెక్కేస్తున్నారు. మరి, ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amaravati: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *