Himayat Sagar: హైదరాబాద్ నగరంతోపాటు పరిసర జిల్లాల్లో భార వర్షం కురిసింది. దీంతో చాలావరకు జలాశయాలు నిండుతున్నాయి. ఈ దశలో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండిపోయింది. దీంతో ఒక గేటును ఎత్తి 339 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఒక గేటును ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Himayat Sagar: ప్రస్తుతం హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 339 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.70 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 2.73 టీఎంసీలకు చేరింది.
Himayat Sagar: హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూసీ పొడవున కూడా వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరం పరిధిలో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు.

