Himachal pradesh: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీని వానలు ముంచెత్తాయి. గతంలో ఒకసారి కురిసన వానలతో భారీ నష్టాన్ని చవిచూసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పెద్ద ఎత్తున జనజీవనం స్తంభించిపోయింది. పర్యాటకులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు.
Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాలతో భారీ ఆర్థిక నష్టం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు 107 మంది చనిపోయారు. 40 మంది వరకు వరదల్లో గల్లంతయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో 266 రోడ్లను అధికారులు మూసి వేశారు.
Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్, కాంగ్రా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. కసౌలిలో 88 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.1,714 కోట్ల మేరకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. 282 తాగునీటి పథకాలతోపాటు 42 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.