మంగళగిరిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణ సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యే సమయంలో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు.ఇందుకు పోలీసులు ఒప్పుకోలేదు.
దీంతో ఆగ్రహానికి గురైన పొన్నవోలు.. పోలీసులకు వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. తమకు అనుమతి కల్పించాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా కావాలని పోలీసులు సూచించడంతో పొన్నవోలు వెనక్కి తగ్గారు. దీంతో పోలీసు విచారణకు సజ్జల హాజరయ్యారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సజ్జలకు విచారణ కొనసాగింది.

