High Court: తెలంగాణ రాష్ట్రంలో కొందరు పోలీసుల అతికి హైకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. నిందితులపై కేసులు నమోదు చేసే సమయంలో, అరెస్టు చేసేటప్పుడు వారి నుంచి సెల్ ఫోన్‌ను తీసుకోవడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీసులు నిబంధనలను కచ్చితంగా ఫాలో కావాల్సిందేనని ఆదేశించింది. పౌరులు ఈ నిబంధనలు తెలుసుకొని తమ హక్కును కాపాడుకోవాలని సూచించింది.
High Court: ప్రొసీజర్ ఫాలో కాకుండా పోలీసులు ఎవరి మొబైల్ ఫోన్‌ను తీసుకోవడానికి వీళ్లేదని తీర్పునిచ్చింది. ఎవరైనా పోలీస్ అధికారులు వచ్చి మీ ఫోన్ ఇవ్వాలని బెదిరించినా, బలవంత పెట్టినా సరైన వారంట్ లేకుండా మీ ఫోన్ ఇవ్వబోమని చెప్పాలని పౌరులకు సూచించింది. పోలీసులు ఎవరి మొబైల్ ఫోన్లు గుంజుకోవద్దని స్పష్టం చేసింది.
High Court: రెండు వారాల క్రితం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిపై ఒక కేసు విషయంలో అరెస్టు చేసినప్పుడు ఆయన అనుమతి తీసుకోకుండా మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. దీనిపై ఆయన హైకోర్టు మెట్లెక్కారు. తన ఫోన్‌ను అక్రమంగా లాక్కొని, ఇవ్వడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
High Court: కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన క్రమంలో ఆయన మొబైల్ ఫోన్‌కు ఏ సంబంధమూ లేకపోయినా దాన్ని లాక్కోవడం చెల్లదని, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 105 కూడా పోలీసులు ఫాలో కాలేదని చెప్పింది. కాబట్టి మొబైల్ ఫోన్‌ను కౌశిక్‌రెడ్డికి వెంటనే తిరిగి ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఈ రోజు పోలీసులు కౌశిక్‌రెడ్డి ఫోన్‌ను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.