High Court: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవికి తెలంగాణ హైకోర్టు తాజాగా నోటీసులను జాఈ చేసింది. ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు వారిద్దరికీ నోటీసులను జారీ చేసింది.
High Court: మున్సిపాలిటీలలో ఉండే భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని హైకోర్టులో ఇటీవల నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తి పిల్ దాఖలు చేశారు. సంబంధిత శాఖలకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని ఆ పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దీనిపై పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత జనవరి 27న హైకోర్టు విచారణను ముగించింది.
High Court: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ప్రభుత్వంపై పిటిషనర్ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు చీఫ్ సెక్రటరీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తాజాగా నోటీసులను జారీ చేసింది. దీంతో విచారణను జూలై 29వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.