HHMV: పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్రబృందానికి కీలకంగా మద్దతిచ్చింది.
ఈ నెల 23వ తేదీన ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఇక సాధారణ ప్రేక్షకులకు సంబంధించిన టికెట్ ధరల్లో కూడా సమయానుకూలంగా మార్పులు జరిగాయి.
లోయర్ క్లాస్ టికెట్లు రూ.100కి పెంపు
అప్పర్ క్లాస్ టికెట్లు రూ.150 వరకు పెంపు
మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.200 వరకు పెరిగే అవకాశం
చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు పది రోజుల పాటు ఈ పెరిగిన ధరలు వర్తింపజేయాలంటూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో సినిమా ప్రీమియర్ షోతోపాటు థియేటర్లలో తొలి వారం వేడుకలకూ భారీ హైప్ నెలకొననున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

