Cryptocurrency Scam

Cryptocurrency Scam: 60 స్కామ్‌లో చిక్కుకున్న తమన్నా, కాజల్ అగర్వాల్‌?

Cryptocurrency Scam: టాలీవుడ్ సీనియర్ హాట్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు లోని పుదుచ్చేరిలో క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు.దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు.ఈ స్కామ్‌కు సంబంధించి హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించనున్నారు పుదుచ్చేరి సైబర్ క్రైం పోలిసులు. క్రిప్టోకరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తానని మూడున్నర కోట్లు రూపాయల తీసుకుని మోసం చేశారని పుదుచ్చేరి చెందిక ఆశోకన్ అనే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు చేసాడు. ఈ నేపధ్యంలో నీతీష్ జైన్,అరవింద్ కూమార్ ని అరెస్టు చేసారు. విచారణలో సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు పోలీసులు.ఇంకా ఆంద్రప్రదేశ్, చెన్నై,కోయంబత్తూరు లోను క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టోకరెన్సీ కి సంబందించి 2022లో కోయంబత్తూరు జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు హీరోయిన్స్ తమన్నా,కాజల్‌ అగర్వాల్. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *