Vijay Deverakonda-Rashmika: టాలీవుడ్లో ఎప్పటినుంచో హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న చివరికి తమ ప్రేమ బంధాన్ని అధికార ముద్ర వేసుకున్నారు. చాలాకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌పై రూమర్స్ వస్తూనే ఉన్నా, ఇప్పటివరకు వీరు ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, ఫారిన్ ట్రిప్స్, వెకేషన్లు మాత్రం అభిమానులకు వీరి ప్రేమను కన్ఫార్మ్ చేశాయి.
తాజా సమాచారం ప్రకారం, శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం విజయ్ దేవరకొండ ఇంట్లో అత్యంత గోప్యతతో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులే హాజరైనట్లు తెలుస్తోంది. ఉంగరాలు మార్చుకున్న ఫొటోలు బయటకు రాకపోయినా, రష్మిక షేర్ చేసిన చీరకట్టులో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవే ఎంగేజ్మెంట్ పిక్స్‌గా అభిమానులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Akshay Kumar: నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు
ఇప్పటికే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఎంగేజ్మెంట్పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 2026లో వీరి పెళ్లి జరగనుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల ద్వారా మొదలైన ఈ జంట కెమిస్ట్రీ, కాలక్రమంలో నిజజీవితంలోనూ బలమైన బంధంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా విజయంతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ అందుకున్నాడు. మరోవైపు రష్మిక మందన్న బాలీవుడ్, సౌత్ సినిమాలతో బిజీగా కొనసాగుతోంది.
అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ జంట పెళ్లి, ఇప్పుడు కేవలం టాలీవుడ్లోనే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎదురుచూసే సెలబ్రిటీ వెడ్డింగ్‌గా మారింది.