E Bike for Children: TVS, BMW మరియు Yamaha వంటి అనేక పెద్ద బ్రాండ్‌లు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ కాన్సెప్ట్ మోడల్‌లను ప్రదర్శించాయి. వీటిలో ఎలక్ట్రిక్ బైక్ లు కూడా ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రదర్శిస్తున్న మోడల్స్ లుక్.. స్పెసిఫికేషన్స్ అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. అలా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వాటిలో హీరో మోటో కార్ప్ తీసుకువచ్చిన పిల్లల బైక్ ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హీరో మోటోకార్ప్ విడా అక్రోను ప్రదర్శించింది. ఇది పిల్లల కోసం ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ బైక్. విడా అక్రో ఒక సాధారణ డర్ట్ బైక్ లాగా కనిపిస్తుంది. విడా అక్రో నిర్దిష్ట ట్రాక్‌లపై నడపడానికి రూపొందించారు. ఇది హబ్ మోటార్‌తో వస్తుంది. ఈ బైక్ గరిష్టంగా 25kmph వేగంతో ప్రయాణించగలదు. థొరెటల్ రెస్పాన్స్ ఛేంజ్ చేయడానికి మూడు రైడింగ్ మోడ్‌లు అందించారు.
Vida Acroకి సస్పెన్షన్ సిస్టమ్ లేదు. ఇది ఒక ‘DIY మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్’. ముందు భాగంలో సర్దుబాటు చేయగల టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంటుంది. అదేవిధంగా, వెనుక స్వింగ్ ఆర్మ్ కూడా ఎత్తు సర్దుబాటు చేయగలదు. దీని వల్ల రైడర్ తన ఎత్తుకు అనుగుణంగా బైక్ ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. అక్రో మాడ్యులర్ సస్పెన్షన్ కిట్ – ఫ్రంట్ బ్రేక్‌తో అందించబడుతుందని హీరో కంపెనీ వర్గాలు చెప్పాయి. దీని ధర సుమారు రూ. 1 లక్ష ఉండవచ్చు మరియు ఈ సంవత్సరం దీపావళి నాటికి ఈ బైక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి
ఇది కూడా చదవండి: Turkey: తుర్కియోలో ఘోర కలి.. భారీ అగ్నిప్రమాదంలో 76 మంది మృతి