Maha Kumbh 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా మహాకుంభమేళా గుర్తింపు పొందనున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు భక్తులు కోట్లాదిగా తరలివస్తూ ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ, మొక్కలు చెల్లించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారతీయులతోపాటు విదేశీయులు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Maha Kumbh 2025: ఈ మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు ఎప్పుడొస్తారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. హైందవ ధర్మాన్ని నమ్మడమే కాక ఆచరిస్తూ వస్తున్న పలువురు ప్రముఖుల రాకపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న మహా కుంభమేళాలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Maha Kumbh 2025: అదే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనవరి 27న, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఫిబ్రవరి 1న మహా కుంభమేళాలో పాల్గొని, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని సమాచారం.