Turkey: తుర్కియె (టర్కీ) దేశంలోని ఓ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 76 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. మరో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఆ హోటల్ 12వ అంతస్తులో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, ఆ హోటల్‌లో మొత్తంగా 234 మంది గెస్ట్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో బాధితుల హాహాకారాలు చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Turkey: తుర్కియో (టర్కీ)లోని వాయువ్య ప్రాంతంలో పాప్యులర్ స్కీ రిసార్ట్‌లో ఓ హోటల్ ఉన్నది. బోలు ప్రావిన్స్ కొరొగ్లు పర్వత ప్రాంతాల్లోని కర్తల్‌కయ వద్దనున్న రిసార్ట్‌లోని గ్రాండ్ కర్తాల్ హోటల్ ఇది. ఈ హోటల్‌లోని 12వ ఫ్లోర్‌లో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో కొందరు దహనం అయ్యారు. మరికొందరు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
Turkey: అగ్నిప్రమాద ఘటన జరిగిన తర్వాత పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాద కారణాలను ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలపాలయ్యారని తెలిసింది.
Turkey: ఆ దేశంలోని పాఠశాలలకు శీతాకాల సెలవులు కావడంతో పర్యాటకులతో హోటళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉన్నదని తుర్కియో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అలీ యెర్లికయే తెలిపారు. ఈ ఘటనతో తమ హృదయాలు బద్దలయ్యాయయని, ఘటనకు కారకులు తప్పించుకోలేరని హెచ్చరించారు.