Nithiin

Nithiin: మహాశివరాత్రికి నితిన్ ‘తమ్ముడు’!?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’గా నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం వెంకీకుడుముల ‘రాబిన్ హుడ్’ తో పాటు వేణుశ్రీరామ్ తో ‘తమ్ముడు’ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. నితిన్ అక్కగా లయ నటిస్తున్న ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజనీశ్ లోక్ నాత్ సంగీతం అందిస్తున్నారు. ‘భీష్మ’ తర్వాత వరుస పరాజయాలను ఫేస్ చేస్తున్న నితిన్ రాబోయే ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Puri-VijaySethupathi: పూరీ - విజయ్ సేతుపతి మూవీకి సంచలన సంగీత దర్శకుడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *