Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ మూవీ పొంగల్ కు రావడం లేదని తీవ్ర నిరాశకు గురైన వారికి ఓ వార్త అశనిపాతంలా తాకీ అంతలోనే వారికి గొప్ప రిలీఫ్ ను ఇచ్చింది. ప్రస్తుతం అజిత్ జనవరి 11, 12 తేదీలలో జరుగబోతున్న కార్ రేసులో పాల్గొనడానికి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ స్పోర్ట్స్ కారులో ప్రాక్టీస్ చేస్తుండగా అది కాస్త గోడను ఢీకొంది. దాంతో ఆ వేగానికి కారు తిరిగి ట్రాక్ పై గిర్రున తిరిగింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భద్రత సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యి… అజిత్ ను అందులోంచి దించి, వేరే కారులో తరలించారు. అదృష్టవశాత్తు అజిత్ కు ఎలాంటి గాయాలకు కాలేదు. ఈ వార్త తెలిసిన అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే అజిత్ నటించి… ‘విడా ముయార్చి’ సినిమా ఫిబ్రవరిలోనూ, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఏప్రిల్ 10న రాబోతున్నాయి. ‘తెగింపు’ తర్వాత అజిత్ ఈ సినిమాలతో మళ్ళీ జనం ముందుకొస్తున్నారు.