Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. సోమవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
ప్రస్తుతం, తిరుమలలోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు సుమారు 20 గంటల సమయం పడుతుంది.
మంగళవారం శ్రీవారిని 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,890 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లుగా ఉంది.
భక్తులందరూ వేచివుండకుండా దర్శనం చేసుకోవడానికి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.