Heavy Rains: హైదరాబాద్ లో పొద్దున నుండి భారీగా వర్షాలు పడుతున్నాయి. మధ్యలో కొంత సేపు వర్షాలు ఆగడం తో జనాలు ఊపిరి పిర్చుకున్నారు. కానీ నగరంలో మళ్లీ వర్షం కురవడం మొదలుపెట్టాయి. ఉదయం మొదలైన జల్లులు, మోస్తరు వర్షంగా కొనసాగుతూ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బాలానగర్, సికింద్రాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, పాతబస్తీ సహా పలు ప్రాంతాలను తడిపాయి. దీంతో రహదారులు జలమయం కాగా, వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వరుసగా వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ హెచ్చరికల ప్రకారం, వచ్చే రెండు మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి, ఫీల్డ్‌లో సిబ్బందిని మోహరించింది.
పాఠశాలలకు సగం రోజు సెలవు
భారీ వర్షాల హెచ్చరికల కారణంగా నగరంలోని ఒంటిపూట పాఠశాలలను ఇవాళ, రేపు మాత్రమే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మధ్యాహ్నం తర్వాత విద్యార్థులు ఇంటికి చేరుకున్నారు.
అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
వర్షాల ప్రభావం కారణంగా అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు.
-
ఎన్డీఆర్ఎఫ్: 8333068536
-
జీహెచ్ఎంసీ: 8125971221
-
ట్రాఫిక్ కంట్రోల్: 8712660600 | 040-278524482
-
హైడ్రా: 9154170992
-
రాచకొండ పోలీసులు: 8712662666
-
సైబరాబాద్ పోలీసులు: 8500411111
-
ఫైర్ సర్వీసెస్: 9949991101
-
వాటర్ బోర్డు (HMWSSB): 9949930003
-
విద్యుత్ (TGSPDCL): 7901530966
-
108 అంబులెన్స్: 9100799129
-
డయల్ 100 (పోలీస్): 8712681241
-
ఆర్టీసీ కంట్రోల్: 9444097000
-
ఎక్సైజ్ శాఖ: 8712659607
-
విపత్తు నిర్వహణ శాఖ: 8712596106 | 8712674000
అధికారులు నగరవాసులకు సూచన చేస్తూ— రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని, అవసరంలేని బయట తిరుగుడు తగ్గించాలని, ఎక్కడైనా నీరు చేరితే వెంటనే హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

