చెన్నైను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. భారీ వర్షాలకు పలు రైళ్ళు, రోడ్డు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై, చెంగల్‌పేట, తిరువలూరు, కాంచీపురం జిల్లాల్లో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.అల్పపీడనం గురువారం ఉదయం చెన్నై తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు, హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సిటీలోని పలు ఏరియల్లో భారీ వర్షం కురుస్తుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.