Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెన్‌గల్ తూఫాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రెండు రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్టై, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.మూడు రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్ఠంగా గంటకు 75 కిమీ వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. శుక్రవారం వరకు తుపాను తీవ్రత కొనసాగుతుందని.. శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది. విశాఖ తో పాటు ఏపీలోని తలుపోర్టులో హెచ్చరికలు జాబ్ చేసింది ఐఎండి. ప్రజల ప్రమోత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వారు అలర్ట్ గా ఉండాలని సూచించింది.