Jammu And Kashmir: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఉగ్రవాద పీడిత ప్రాంతంలో ప్రస్తుతం శాంతి నెలకొనడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక అభివృద్ధికి 48 ప్రాంతాలను గుర్తించారు. వచ్చే ఐదేళ్లలో పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, సాహసోపేతమైన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు భారత సైన్యం కట్టుబడి ఉన్నట్లు ఉపేంద్ర ద్వివేది చెప్పారు.
ఇది కూడా చదవండి: Supreme Court: రిజర్వేషన్ల కోసం మతమార్పిడి రాజ్యాంగ ద్రోహం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
కోచ్‌ల సహాయంతో పర్వతారోహణ వంటి సాహసయాత్రల్లో ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం స్థానికులకు శిక్షణ కూడా ఇవ్వాలని యోచిస్తున్నారు. ట్రాన్స్-హిమాలయన్ ట్రెక్, ఉత్తరాఖండ్‌లో ‘సోల్ ఆఫ్ స్టీల్’ ట్రెక్, సియాచిన్ గ్లేసియర్‌లో ట్రెక్కింగ్ అడ్వెంచర్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్గిల్, కల్వాన్ వ్యాలీ, సియాచిన్ గ్లేసియర్ వంటి ప్రదేశాలను పర్యాటకులు యుద్ధ అనుభవాలను తెలుసుకునేందుకు వీలుగా పర్యాటకుల కోసం ఓపెన్ చేయాలని నిర్ణయించారు.