Heavy Rainfall Alert

Heavy Rainfall Alert: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..!

Heavy Rainfall Alert: రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

 గురువారం

ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం

నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాహేతర బంధం పెట్టుకుంటే కేసులే

శనివారం

వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది.

ఆదివారం

హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

ప్రజలకు సూచనలు

చెట్ల క్రింద నిలబడవద్దు. విద్యుత్‌ స్తంభాలు, కరెంటు వైర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi Sanjay: మావోయిస్టులతో మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *