Tirumala: అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కురుస్తున్న వాన. లైన్లలో ఉన్న భక్తులను షెడ్లలోకి తరలిస్తున్న అధికారులు వర్షంలో ఉండవద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపుతామని భక్తులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి.
నెల్లూరు జిల్లా… కూడా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలిలో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిపిస్తుంది. దీంతో రోడ్లు అన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీ లు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది. వర్షం పెద్దగా కురవటంతో కరెంట్
కూడా తీసివేశారు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలానే మరో రెండు రోజులు వర్షం కురిస్తే చెరువులు తెగిపోయి వాగులు,వంకలు వచ్చే ప్రమాదం ఉంది.

