Phone Tapping Case

Phone Tapping Case: ప్రభాకర్‌రావు బెయిల్‌పై విచారణ వాయిదా

Phone Tapping Case: ఫోన్‌ అక్రమంగా ట్యాప్‌ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, స్టేటస్‌ రిపోర్టు సమర్పించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు.

ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో, అప్పటివరకు మధ్యంతర ఉపశమనం (ఇంటిరిమ్ రిలీఫ్) కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఈ విచారణలో జరిగే ప్రతి పరిణామం మీద అందరిలో ఆసక్తి నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manchu Family Controversy: హీటేక్కిస్తున్న మంచు మనోజ్ ఫ్యామిలీ హైడ్రామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *