Health benefits: మన దక్షిణ భారతీయ ఆహార సంస్కృతిలో అన్నం, పప్పు అనేది సంపూర్ణ భోజనం. దాళీని అన్నంతో కలిపి తింటే అది సంపూర్ణాహారంగా మారుతుంది.
అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వలన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. పప్పులోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ రెండింటి కలయిక శరీరానికి అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తుంది.
అన్నం-పప్పు కలయిక శతాబ్దాలుగా మన ఆహారంలో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది తక్కువ ఖర్చుతో లభించే, అత్యంత ఆరోగ్యకరమైన ఆహార కలయిక. కాబట్టి దాళీని అన్నంతో కలిపి తినడం రుచికరంగానే కాకుండా శరీరానికి సమగ్ర పోషణను అందిస్తుది.