Health benefits: పాలకూర మన ఆహారంలో అత్యంత విలువైన ఆకుకూర. ఇందులో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. దాళీలో పాలకూర వేసి వండితే అది రుచికరంగానే కాకుండా అత్యంత ఆరోగ్యకరమైన వంటకం అవుతుంది.
పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది. అలాగే కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.
ఇంకా పాలకూరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, మాగ్నీషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి దాళీలో పాలకూర కలపడం ద్వారా మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చ.