Health benefits: గుడ్లను సాధారణంగా “సంపూర్ణ ఆహారం” (Complete Food)గా పేర్కొంటారు. ఎందుకంటే వీటిలో దాదాపు అన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దాళీలో గుడ్లు వేసి వండితే వంటకం ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ప్రత్యేక వంటకంగా మారుతుంది.
గుడ్లలోని ప్రోటీన్ శరీరంలోని కండరాల పెరుగుదలకు, కణాల నిర్మాణానికి ముఖ్యంగా అవసరం. అలాగే గుడ్లలోని కోలిన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ A, విటమిన్ D, విటమిన్ B12, ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి.
ఇవి ఎముకల బలాన్ని పెంచడమే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గుడ్డు దాళీ అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న వయసులో ఉన్న పిల్లలకు ఇది బలాన్నీ, మానసిక వికాసాన్నీ అందిస్తుది.