Viral News

Viral News: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. పదేళ్లు ఎంజాయ్ చేశాడు.. కట్ చేస్తే సోషల్ మీడియాలో బుక్కయ్యాడు!

Viral News: ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్న ఘనుడిని ఫేస్ బుక్ పట్టించింది. ఈ కేరళ కళ్యాణ రాముడు చేసిన మోసం బయటపడి ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నాడు.

కేరళలోని కాసర్గోడ్ సమీపంలోని వెల్లరికున్ను ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల దీపు ఫిలిప్ మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఒక హాబీగా మార్చుకున్నాడు. తనకు అమ్మాయి నచ్చితే చాలు.. ఆమెను ఎదో విధంగా ట్రాప్ చేస్తాడు. పెళ్ళికి ఒప్పిస్తాడు. ఆమెతో కొన్నిరోజులు కాపురం చేస్తాడు. తరువాత అక్కడ నుంచి బిచాణా ఎత్తేస్తాడు. మరో ప్రాంతంలో దుకాణం తెరుస్తాడు. తరువాత అక్కడ ఇంకో అమ్మాయి. ఇలా పదేళ్లుగా నలుగుర్ని పెళ్ళిచేసుకుని.. మొదటి ఇద్దరినీ వదిలేసి.. చివరి ఇద్దరితో ఒకరికి తెలియకండా ఒకరితో మేనేజ్ చేసేస్తున్నాడు. ఏమిటి సినిమా స్టోరీలా ఉంది కదూ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది..

ఆఖరుకు మనోడి కథ క్లైమాక్స్ కు వచ్చింది. క్లైమాక్స్ కి వెళ్లేముందు మనోడి పెళ్లి లీలలు చూద్దాం.
10 సంవత్సరాల క్రితం కేరళలోని కాసర్గోడ్ కు చెందిన ఒక యువతిని మొదటిసారి వివాహం చేసుకున్నాడు. అతను అతనితో మూడు సంవత్సరాలు నివసించాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆ మహిళ నగలు, డబ్బు దొంగిలించి అదృశ్యమయ్యాడు. తరువాత, కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడే కాసర్గోడ్‌లో రెండవసారి వివాహం చేసుకున్నాడు. అతను ఆ మహిళతో తమిళనాడులో కొన్ని సంవత్సరాలు నివసించాడు. కొన్నాళ్ల తరువాత సీన్ రిపీట్. ఆమెను వదిలేసి.. డబ్బు దస్కంతో మాయమైపోయాడు. ఈసారి ఎర్నాకులంలో తేలాడు. అక్కడే ఉంటున్న ఒక మహిళను మూడవసారి వివాహం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Chiranjeevi: పొలిటికల్ ఎంట్రీపై చిరు షాకింగ్ కామెంట్స్..

మూడో పెళ్లి తరువాత రూటు మార్చాడు. ఆమెతో కాపురం చేస్తూనే.. అలప్పుజకు చెందిన విడాకులు తీసుకున్న ఒక మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమెను ట్రాప్ చేశాడు. నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అయితే, మూడు, నాలుగు భార్యలతో ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం కొనసాగిస్తూ వచ్చాడు. కానీ, మనోడికి ఈ నాల్గవ భార్య తనను ఇబ్బంది పెట్టబోతోందని తెలియలేదు. కొన్నాళ్ళు బాగానే గడిచింది.

కథ క్లైమాక్స్ కు వచ్చింది. దీపు ఫిలిప్ రెండో భార్య, నాలుగో భార్య ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. ఒకరితో ఒకరికి మంచి స్నేహ ఏర్పడింది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే సమయంలో ఇద్దరి భర్త ఒక్కలానే ఉన్నట్టు తెలిసింది. ఇద్దరూ మరింత వివరంగా ఫోటోలు షేర్ చేసుకుని పరిశీలిస్తే.. వాడే వీడు.. అని రూఢీ అయిపొయింది. ఇంకేముంది.. నాలుగో భార్య లబోదిబో మని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అయ్యగారిని తమదైన స్టైల్ లో దర్యాప్తు చేస్తే నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం బయటపడింది. దీంతో దీపు ఫిలిప్ ను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

ALSO READ  Telangana News: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌కు హైకోర్టులో ఊరట

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *