Harish Rao:

Harish Rao: సాగునీటి ప్రాజెక్టుల‌పై హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు

Harish Rao: సాగునీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వైఖ‌రిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ బాగోగుల గురించి అస‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే లేద‌ని ఆరోపించారు. ఆయ‌న‌కు సాగునీటి ప్రాజెక్టుల‌పై స‌రైన అవ‌గాహ‌న లేద‌ని విమ‌ర్శించారు.

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవ‌ల ఖ‌ర్గేను క‌లిసేందుకు బెంగ‌ళూరు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి సీఎం, డిప్యూటీ సీఎంల‌తో ఆల్మ‌ట్టి ఎత్తు పెంపుపై చ‌ర్చిస్తార‌ని తాము అనుకున్న‌ట్టు హ‌రీశ్‌రావు తెలిపారు. కానీ, సొంత పార్టీ ప్ర‌భుత్వం అయినా మాట్లాడ‌కుండానే తిరిగి వ‌చ్చారని తెలిపారు. ఆల్మ‌ట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుంద‌న్న బుద్ది రేవంత్‌రెడ్డికి లేద‌ని ఆరోపించారు.

Harish Rao: రేవంత్‌రెడ్డికి బ్యాగులు మోయ‌డ‌మే తెలుస‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల బాగోగులు గురించి ప‌ట్టించుకోడ‌ని హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించిన‌ప్పుడు కుడికాలువ కెపాసిటీ 11,500 క్యూసెక్కులుగా చూపార‌ని, ఇప్పుడు 23,000 క్యూసెక్కులుగా అంత‌కంత‌కూ పెంచుకుంటూ వ‌చ్చార‌ని ఆరోపించారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎలా అనుమ‌తిస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

Harish Rao: గ‌తంలో ఇదే కాలువ కెపాసిటీని 11,500 క్యూసెక్కుల నుంచి 18,000కు పెంచిన‌ప్పుడు ఆనాటి కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తే ప‌నులు ఆగిపోయాయని హరీశ్‌రావు తెలిపారు. ఈనాడు 23,000 క్యూసెక్కుల‌కు పెరిగినా రేవంత్‌రెడ్డి స‌ర్కారులో ఎవ‌రూ అడ్డుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ఆయా ప‌నుల‌కు బిల్లులు కూడా మంజూర‌య్యాయ‌ని తెలిపారు. ఏపీ 463 టీఎంసీల నీళ్లు మ‌ళ్లిస్తే పైన క‌ర్ణాట‌క 112 టీఎంసీలు ఆపుకుంటాన‌ని క‌ర్ణాట‌క అంటుంద‌ని, 74 టీఎంసీలు నిలుపుకుంటాన‌ని మ‌హారాష్ట్ర అంటుంద‌ని తెలిపారు. ఈ ద‌శ‌లో మ‌న తెలంగాణ ప‌రిస్థితి ఏమిట‌ని, తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడితే న‌ల్ల‌మ‌ల బిడ్డ‌న‌ని అంటాడ‌ని, ఆ న‌ల్ల‌మ‌ల‌ను ఆనుకుని పారే కృష్ణా న‌దిలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు న‌ష్టం జ‌రిగితే ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఆల్మ‌ట్టిలో 112 టీఎంసీలు నిల్వ చేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాసింద‌ని తెలిపారు.

Harish Rao: బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు టెక్నో ఎక‌నామిక్ అప్రైజ‌ల్ ప్రాసెస్ కొన‌సాగిస్తున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశార‌ని, 20 రోజులైనా ఆ లేఖ‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించ‌డం లేద‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. వ‌ర‌ద జ‌లాల‌పై డీపీఆర్ అప్రైజ‌ల్ సాధ్యంకాద‌ని కేంద్రాన్ని, ఏపీని రాష్ట్ర ప్ర‌భుత్వం నిల‌దీయాల‌ని సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *