Harish Rao:

Harish Rao: కాంగ్రెస్ వైఖ‌రిపై హ‌రీశ్‌రావు హాట్ కామెంట్స్‌

Harish Rao: అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీ స‌భ్యుడు జ‌గ‌దీశ్‌రెడ్డి ఎలాంటి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని తేల్చి చెప్పారు. స్పీక‌ర్‌ను ఆయ‌న అవ‌మానించేలా ఎలాంటి మాట‌లు అన‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ వాయిదా అనంత‌రం బ‌య‌ట ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Harish Rao: జ‌గ‌దీశ్‌రెడ్డి మాట్లాడుతూ స‌భ మీ ఒక్క‌రిది కాదు.. స‌భ అంద‌రిదీ అని అన్నార‌ని హ‌రీశ్‌రావు చెప్పారు. మీ అనే ప‌దం స‌భా నింధ‌న‌ల‌కు విరుద్ధం ఎలా అవుతుందని ప్ర‌శ్నించారు. మీ అనే ప‌దం విరుద్ధం కాద‌ని తేల్చి చెప్పారు. అన్‌పార్ల‌మెంట‌రీ ప‌దం కూడా కాద‌ని చెప్పుకొచ్చారు. అస‌లు కాంగ్రెస్ స‌భ్యులు ఎందుకు నిర‌స‌న వ్య‌క్తం చేశారో, స‌భ‌ను ఎందుకు వాయిదా వేశారో? అని హ‌రీశ్‌రావు అనుమానం వ్య‌క్తం చేశారు.

Harish Rao: కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో ప‌డింద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. స్పీక‌ర్‌ను క‌లిసి స‌భా రికార్డులు తీయాల‌ని తాము కోరామ‌ని చెప్పారు. 15 నిమిషాలు దాటినా వీడియో రికార్డుల‌ను స్పీకర్ కార్యాల‌యం తెప్పించ‌లేద‌ని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద బీఆర్ఎస్ స‌భ్యులు మాట్లాడ‌కుండా బ్లాక్ చేశార‌ని తెలిపారు. ఇలాంటి వైఖ‌రి మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *