Hari Hara Veeramallu:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్‌కల్యాన్‌కు అభిమానులే కాదు.. వీరభక్తులు ఉంటారని ఓ అభిమాని నిరూపించాడు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా చిత్రకారుడైన ఓ అభిమాని తన అభిమాన నటుడిపై వీరాభిమానాన్ని చాటుకున్నాడు.
Hari Hara Veeramallu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు పవన్‌కల్యాణ్ చిత్రాన్ని తన రక్తంతో గీశాడు. హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా తన అభిమాన నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసినట్టు శ్రీనివాసులు తెలిపారు.