Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: వీరమల్లు సీక్వెల్ టైటిల్ అదిరింది.. అసలైన యుద్ధం అప్పుడే మొదలు

Hari Hara Veera Mallu: ఐదేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా హంగామా చేస్తోంది. జులై 23 రాత్రి నుంచే ప్రీమియర్స్ మొదలవడంతో థియేటర్స్‌ వద్ద పవన్ ప్రభంజనం మొదలైంది.

రెండు భాగాల కథ – కోహినూర్ కోసం వీరమల్లు పోరాటం

కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే ఈ కథ 16వ శతాబ్దపు మొఘల్ పాలన నేపథ్యంలో సాగుతుంది. హిందువులపై మొఘలులు చూపిన దారుణాలు, పన్నుల వసూళ్లు, అన్యాయాలు కథలో ముఖ్యాంశం. కుతుబ్ షాహీ నుంచి ఆజ్ఞ తీసుకున్న వీరమల్లు, ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరతాడు.

మొదటి పార్ట్ చివర్లో వీరమల్లు ఢిల్లీకి వెళ్లగా, ఔరంగజేబు అతనిని అడ్డుకునేందుకు సిద్ధమవుతాడు. ఇక్కడే కథ ఆగిపోతుంది. రెండో పార్ట్‌లో అసలైన యుద్ధం, కోహినూర్ కోసం జరిగిన పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

సీక్వెల్‌పై భారీ అంచనాలు

‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్‌తో తొలి భాగం విడుదల కాగా, చివర్లో ‘హరి హర వీర మల్లు: పార్ట్ 2 – యుద్ధభూమి’ టైటిల్‌ను చిత్రబృందం రివీల్ చేసింది. ఈ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ – బాబీ డియోల్ మధ్య యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు ప్రధాన హైలైట్ కానున్నాయి. నిధి అగర్వాల్ ఇప్పటికే రెండో పార్ట్‌కు సంబంధించిన 20 నిమిషాల షూటింగ్ పూర్తయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరలోనే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Devara 2: దేవర 2 ఇంకెప్పుడు?

సినిమా వెనుక కథ

2019లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా, అనుకోని కారణాలతో జ్యోతికృష్ణ చేతుల్లోకి వెళ్లింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సత్యరాజ్‌, నర్గీస్ ఫక్రీ, దలిప్ తాహిల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్, ఏఎం రత్నం నిర్మాణం సినిమాకు బలాన్నిచ్చాయి.

పవన్ పవర్ థియేటర్లలో హైలైట్

రిలీజ్ ముందు బజ్ తక్కువగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక్కసారిగా సినిమా హైప్ పెరిగింది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ట్రేడ్ వర్గాలు ఈ సినిమాకు భారీ వసూళ్లు రాబోతాయని అంచనా వేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *