HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన సినిమా ‘హరి హర వీరమల్లు’ చివరికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
అంచనాలు ఆకాశమంత
పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. రిలీజ్ ఒక్క రోజు ముందుగానే థియేటర్స్ ముందు ఫాన్స్ సంబరాలు మొదలు పెట్టారు. పవన్ నుండి చల్ల రోజుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాపైన భారీగా పెట్టుబడులు పెట్టారు.
ఏరియా వారీ బిజినెస్
ఆంధ్ర, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలిపి మొత్తం రూ.126 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.
- నైజాం ఒక్కదానికే రూ.37 కోట్లు
- రాయలసీమ రూ.16 కోట్లు
- ఉత్తరాంధ్ర రూ.12 కోట్లు
- మిగిలిన ఆంధ్ర జిల్లాలు కలిపి దాదాపు రూ.38 కోట్లు
- ఓవర్సీస్ + ఇతర రాష్ట్రాలు రూ.22.50 కోట్లు
సక్సెస్ అంటే ఏమిటి?
ఈ సినిమా సక్సెస్ కావాలంటే కనీసం రూ.210 కోట్ల గ్రాస్ రాబట్టాలి. ఇది పవన్ ఫాన్స్ కి చిన్న పాటి యుద్ధం లాంటిదే. అయితే ప్రస్తుత బజ్ ఇంకా బుకింగ్స్ చూస్తుంటే, కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే రూ.40 కోట్ల వరకు రాబడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ఫ్యాన్స్ vs బాక్సాఫీస్
పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిమాన బలం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తేవడంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈసారి బజ్ + కంటెంట్ రెండూ సరిగ్గా పనిచేస్తే, ‘హరి హర వీరమల్లు’ పవన్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

