Hansika: తన స్నేహితురాలి మాజీ భర్తను హీరోయిన్ హన్సిక మోత్వాని 2022 డిసెంబర్ లో పెళ్ళి చేసుకుంది. అయితే… భర్త సోహెల్ కతూరియా తన సోదరుడి స్నేహితుడని, ఎప్పటి నుండో తమ కుటుంబానికి సన్నిహితుడని ఆ వివాహం సందర్బంగా ఆమె వివరణ ఇచ్చింది. పెళ్ళి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది హన్సిక. అంతేకాదు… ఇటీవల లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనితో పాటు డాన్స్ ప్రోగ్రామ్ ఢీ కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తాజాగా పెళ్ళై రెండేళ్ళకు ఆమె ఓ శుభవార్త తెలిపింది. అయితే అది అందరూ అనుకుంటున్నట్టు ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్త కాదు.. హన్సిక తన భర్తతో కలిసి సొంత ఇంటికి వెళ్ళింది. ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో హన్సిక పోస్ట్ చేయడంతో అభిమానులంతా అభినందనలు తెలియచేస్తున్నారు.
