Gyanesh Kumar: ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్ల వైపే ఉంటుందని భారత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్క్షానేశ్‌కుమార్ (Gyanesh Kumar) తెలిపారు. బుధవారం (ఫిబ్రవరి 19న) ఉదయం ఆయన 26వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సీఈవో జ్క్షానేశ్కుమార్కు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సింధు అభినందనలు తెలిపారు. అనంతరం సీఈవో జ్క్షానేశ్‌కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gyanesh Kumar: దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్ అని సీఈవో జ్క్షానేశ్‌కుమార్ తెలిపారు. 18 ఏండ్ల వయసు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఎన్నికలోనూ ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. భారత రాజ్యంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం ఓటర్లతోనే ఎన్నికల సంఘం ఉంటుందని తెలిపారు.
Gyanesh Kumar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్క్షానేశ్కుమార్ను ఖరారు చేసింది. ఈ మేరకు నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సీఈసీగా జ్క్షానేశ్‌కుమార్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు.
Gyanesh Kumar: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్క్షానేశ్‌కుమార్ పదవీకాలం 2029 జనవరి 26 వరకు ఉండనున్నది. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్క్షానేశ్‌కుమార్ స్థానంలో హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి నియమితులయ్యారు. 1988 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన జ్క్షానేశ్‌కుమార్ ఐఐటీ కాన్ఫూర్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు.
Gyanesh Kumar: జ్క్షానేశ్‌కుమార్ ఐసీఎఫ్ఏఐలో బిజినెస్ ఫైనాన్స్, యూఎస్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలోని హెచ్ఐఐడీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదివారు. 2024 జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ సెక్రటరీగా ఆయన రిటైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన జ్క్షానేశ్‌కుమార్.. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర ట్రస్టు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రామమందిరంపై సుప్రీంకోర్టు విచారణలను కూడా జ్క్షానేశ్‌కుమార్ క్రమం తప్పకుండా పర్యవేక్షించినట్టు తెలుస్తున్నది.