GV Prakesh

GV Prakash: దీపావళికి జీవీ ప్రకాశ్‌ డబుల్ థమాకా

GV Prakash: ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్ దీపావళికి ఆడియెన్స్ నుండి డబుల్ ట్రీట్ అందుకున్నాడు. అతను సంగీతం సమకూర్చిన ‘అమరన్, లక్కీ భాస్కర్’ సినిమాలు దీపావళి కానుకగా విడుదలయ్యాయి. రెండూ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ‘అమరన్’ వంద కోట్ల క్లబ్ లో మూడు రోజులకే చేరిపోగా… ‘లక్కీ భాస్కర్’ 50 కోట్ల గ్రాస్ ను నాలుగో రోజుకు దాటింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ‘లక్కీ భాస్కర్’ విజయోత్సవంలో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. తెలుగులో ‘మహానటి, సీతారామం’ తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా చక్కని విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని దుల్కర్ సల్మాన్ తెలిపాడు. ‘సినిమా బ్లాక్ బస్టర్’ అంటూ తనకు ఫస్ట్ మెసేజ్ జీవీ ప్రకాశ్‌ పెట్టాడని దుల్కర్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: Eesaraina Movie: ఈసారైనా.. నవంబర్ 8న రిలీజ్ కు రెడీ..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *