మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందన్నారు. నల్గొండ లోనే నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని అన్నారు.ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం సరైనది కాదని తెలిపారు.అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు.