Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో కేవలం పది వేల రూపాయల జీతం బకాయి వివాదం ఊహించని నష్టానికి దారితీసింది. మాజీ యజమాని తనకు రావాల్సిన డబ్బుని ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగం నుంచి తీసేశాడన్న కక్షతో రగిలిపోయిన ఓ అకౌంటెంట్ ఏకంగా టెక్స్టైల్ మార్కెట్‌కే నిప్పుపెట్టాడు. ఈ దారుణ ఘటనలో సుమారు 14 దుకాణాలు పూర్తిగా బూడిదై ఏకంగా రూ.24 కోట్ల విలువైన వస్త్రాలు, ఆస్తులు దగ్ధమయ్యాయి. తొలుత షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంగా భావించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో నిందితుడి అసలు కుట్ర బట్టబయలైంది.
రూ.10 వేల గొడవ – పెట్రోల్ పోసి విధ్వంసం..
రాత్రి వేళ మార్కెట్లోకి ప్రవేశించిన వినోద్.. సీసీటీవీల్లో కనిపించకుండా తిరుగుతూ దుకాణాల వద్ద వస్తువులను ధ్వంసం చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను దుకాణాలపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.
14 దుకాణాలు దగ్ధం – రూ.24 కోట్ల బూడిద..
మార్కెట్లో మంటలు చెలరేగిన వెంటనే వ్యాపారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన పోలీసులు.. కేసు నమోదు చేసి క్షేత్రస్థాయిలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో వినోద్ సంచరిస్తూ నిప్పంటిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కేవలం రూ.10 వేల కోసం మొదలైన చిన్న వివాదం రూ.24 కోట్ల నష్టానికి, తీవ్ర క్రిమినల్ కేసుకు దారితీయడం స్థానికంగా పెను సంచలనం రేపింది.
₹10 వేల వివాదం.. ₹24 కోట్ల భారీ నష్టం!
పెండింగ్‌లో ఉన్న ₹10 వేల జీతం విషయంలో జరిగిన వివాదం చివరకు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ టెక్స్టైల్ షాపులో అకౌంటెంట్‌గా పనిచేసిన వినోద్ పండి సావ్ల.. మూడు నెలలకే ఉద్యోగం మానేశాడు.
తనకు రావాల్సిన ₹10 వేలు… pic.twitter.com/S71LlrmsEh
— Tupaki (@tupaki_official) September 23, 2026
