Group 2 Exam Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్ష ఫలితాలు నేడు (మార్చి 11, 2025) విడుదల కానున్నాయి. గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫలితాలను TSPSC అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in) లో చూడవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.
అయితే, ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన కోసం TSPSC వెబ్సైట్ను సందర్శించండి
ఇది కూడా చదవండి: Sam Pitroda: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడాపై ఎఫ్ఐఆర్

