Viswam: గోపీచంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విశ్వం’. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. హాట్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం బాగానే ఆడింది. చాలా కాలం తరువాత శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ సీన్స్ తో బాగానే నవ్వించాడు. అయితే, ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశ్వం సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి ప్రస్తుతం ఓటిటిలో మంచి ఆదరణ లభిస్తూ ఉంది. రోజురోజుకూ ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ పెరుగుతూ ఉండటం విశేషం. గోపీచంద్ కెరీర్ లో ఓటీటీ పరంగా చూసుకుంటే.. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అత్యధిక వ్యూస్ ను సాధించే అవకాశం ఉంది.
