Panjaram: సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన పూర్తి స్థాయి హారర్ చిత్రం ‘పంజరం’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆర్. రఘన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ హారర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘పంజరం’
‘పంజరం’ ట్రైలర్ చూసిన వారికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ‘పేదరాసి పెద్దమ్మ’ అనే భయానక కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్లో హారర్ ఎలిమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. చిత్రంలోని భయానక నేపథ్యం, నాణ్యమైన కెమెరా వర్క్, నాని మోహన్ అందించిన నేపథ్య సంగీతం (ఆర్.ఆర్) సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి. ట్రైలర్ చివర్లో వచ్చే షాట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచింది.
Also Read: Nagarjuna: నాగార్జున 100వ చిత్రంలో టబూ హీరోయిన్?
సినిమాపై టీమ్ కాన్ఫిడెన్స్
ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో దర్శకుడు సాయి కృష్ణ మాట్లాడుతూ, తన టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు నాని మోహన్ సంగీతం, ఆర్.ఆర్ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని, పాటలు కూడా అందరినీ మెప్పిస్తాయని ఆయన అన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన అనిల్, యువతేజ, ముస్కాన్, రూప నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.
హీరో యువతేజ మాట్లాడుతూ, తాను ఈ చిత్రంలో ‘మల్లి’ అనే కొత్త తరహా పాత్రను పోషించానని తెలిపారు. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. హీరో అనిల్ కూడా ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందని హామీ ఇచ్చారు. అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ‘పంజరం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి భయాన్ని, విజయాన్ని పంచుతుందో చూడాలి.