Good Bad Ugly: అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రను పోషించాడు. ఇదిలా ఉంటే శనివారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెలిపాడు. అజిత్ తో కలిసి పనిచేయడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నానని, ఈ ప్రయాణంలో బోలెడన్ని జ్ఞాపకాలను పోగేసుకున్నానని అధిక్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ లో మళ్లీ హింస! ఇద్దరు కూలీలను కాల్చేసిన మిలిటెంట్లు!
Good Bad Ugly: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25న విడుదల కావాల్సిన నితిన్ మూవీ ‘రాబిన్ హుడ్’ను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. ఆ డేట్ లో మోహన్ లాల్ ‘బరోజ్’ త్రీడీ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే రిలీజ్ చేస్తోంది. ఒకవేళ ‘రాబిన్ హుడ్’ను సంక్రాంతికి విడుదల చేస్తే… ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని అప్పుడు విడుదల చేసే ఆస్కారం ఉండదు. కానీ తమిళనాడులో మాత్రం పొంగల్ కే అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

