Gold Rate Today: పసిడి ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. అన్నిరకాల బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. వివాహ శుభకార్యాలు దగ్గరపడటంతో ఊపందుకున్నాయి. వెండి కూడా గత ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చి 14న ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి 89,450కి చేరుకున్నది. గత నెల 20న మేలిమి బంగారం ఇదే ధర పలకడం గమనార్హం. 99.5 శాతం స్వచ్ఛత లోహం ధర రూ.600 పెరిగి 89,05కి చేరింది. కిలో వెండి మరో రూ.1000 మేర పెరిగి రూ.1,01,200గా పలికింది.
హైదరాబాద్లో బంగారం ధరలు -10 గ్రాములు (14-03-2025)
22 క్యారెట్ల బంగారం ధర – రూ.82,300 (రూ.1100 పెరుగుదల)
24 క్యారెట్ల బంగారం ధర – రూ.89,750 (రూ.1200 పెరుగుదల)