Gold rate: భారత్ లో పండగలు, శుభకార్యాలు, వేడుకల్లో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా మహిళలు ఆభరణాలుగా ధరిస్తారు. ఇక పండగల సీజన్‌లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే, గత కొద్ది రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నా క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు బ్రేక్ ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లు తెలిసిన తర్వాత బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి.
డాలర్ విలువ పుంజుకుని బంగారం రేట్లు దిగివస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ. 72 వేల 750 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 110 తగ్గి రూ. 79 వేల 360 వద్దకు పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గడంతో రూ. 72 వేల 900 వద్దకు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ.110 దిగివచ్చి రూ. 79 వేల 510 పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గడంతో రూ. 72 వేల 750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ.110 దిగివచ్చి రూ. 79 వేల 575గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ.110 దిగివచ్చి రూ. 79 వేల 575గా ఉంది.