బంగారం కొనాలంటే కాదు చూడాలన్న డబ్బులుంకట్టల్నేమో.. అలాంటి రోజుకు వస్తాయేమో అని భయపడుతున్నారు మధ్యతరగతి వాసులు.
అవును మరి బంగారం ధరలకు కాళ్ళు రెక్కలు కాదు ఏకంగా రాకెట్ కు ఉన్న ఇంజన్ వచ్చి కూర్చుంది. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
ఇదే క్రమంలో శుక్రవారం తులం బంగారం ధర రూ.1,150 ఎగబాకి రూ.78,500 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి రూ.1,500 అధికమై రూ.93 వేలు పలికింది. వరుసగా రెండోరోజు కూడా ధరలు పెరగడం విశేషం. .