Gold Price Today: పండగ సీజన్ అంటేనే బంగారం షాపుల్లో సందడి మొదలవుతుంది. శుభకార్యాల కోసం, బహుమతుల కోసం ప్రజలు బంగారం కొనుగోలు చేస్తారు. కానీ ఈసారి పండగ వేళ బంగారం ధరలు ఊహించని విధంగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. అమెరికా ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పులు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో ధరలు (సెప్టెంబర్ 23, మంగళవారం నాటి అంచనా ధరలు):
* హైదరాబాద్, కరీంనగర్, వరంగల్: ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,12,580 రూపాయలు (1 తులం). 22 క్యారెట్ల బంగారం ధర 1,03,200 రూపాయలుగా ఉంది. వెండి ధర కిలోకు 1,44,900 రూపాయలు.
* ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర 1,12,290 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,02,940 రూపాయలు. వెండి ధర కిలోకు 1,34,900 రూపాయలు.
* ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర 1,12,140 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,02,790 రూపాయలు. వెండి ధర కిలోకు 1,34,900 రూపాయలు.
* చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర 1,12,250 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,02,890 రూపాయలు. వెండి ధర కిలోకు 1,44,900 రూపాయలు.
* బెంగళూరు: 24 క్యారెట్ల ధర 1,12,140 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,02,790 రూపాయలు. వెండి ధర కిలోకు 1,33,500 రూపాయలు.